Diabetes and Diets

Diabetes and Diets :

diabetes diabetes 2 type diabetes type 2 diabetes mellitus diabetes symptoms diabetes type 1 diabetes diet diabetes insipidus diabetes types diabetes ketoacidosis what diabetes causes diabetes causes diabetes is caused by diabetes diet chart diabetes neuropathy diabetes treatment diabetes control diabetes medicine for diabetes medicine diabetes fruits diabetes in hindi diabetes normal range diabetes range diabetes mellitus definition diabetes food chart  diabetes meaning diabetes range normal diabetes food diabetes yoga


మధుమేహం వంశపారంపర్యమైన వ్యాధి . తల్లితండ్రులిద్దరిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటే పిల్లలలో ఈ వ్యాధి రావడానికి 50 శాతం అవకాశం ఉంటుంది. తల్లితండ్రులు ఇద్దరికి ఉంటే నూటికినూరుపాళ్లు పిల్లలకు వస్తుంది. కావున కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నచో మధుమేహం ముప్పు నుంచి కొంత తప్పించుకోవచ్చు. అవి
* మితాహార నియమాలు విధిగా పాటించాలి .
* శరీరం బరువు , లావు పరిమితికి మించకుండా చూసుకోవాలి .
* ప్రతినిత్యం వ్యాయాయం చేయాలి .
* మానసిక ఒత్తిడిని దూరం పెట్టాలి.
* కార్టిజోన్స్ , స్టెరాయిడ్స్ వాడరాదు.
* తరచుగా వైద్యుడి వద్ద పరీక్షలు చేయించుకుని సలహాలు తీసుకోవాలి .
పైన విషయాలలో తగిన జాగ్రత్త తీసుకుంటే ఈ రోగాన్ని దూరంగా ఉంచవచ్చు.
పాటించవలసిన ఆహారనియమాలు -
అన్నింటిలో మొదటిది క్రమబద్ధమైన నియమిత ఆహార సమయం . వరిఅన్నం తినేవారు గోధుమకు మారవలసిన అగత్యం లేదు . అన్నిరకాల తృణధాన్యాలలో 70 శాతం పిండిపదార్థాలు ఉండటం వలన ఈ మార్పిడి వలన ప్రయోజనం ఏమి లేదు . ఎవరి అలవాట్లకు వారు అణుగుణంగా వారు ఆహారం తీసుకోవచ్చు అయితే రోగి ఇంతకు పూర్వం తీసుకునే ఆహారపదార్థాల పరిమాణం మాత్రం ఈ వ్యాధి కారణంగా మార్చుకోవలసి ఉంటుంది.
ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే గింజ ధాన్యాలతో అనగా మినుములు , పెసలు, శనగలు , కందులతో చేయబడిన ఆహారపదార్థాలు , పిండిపదార్థాలు ఎక్కువుగా తీసుకోవాలి . వీటిలో తాలింపు పెట్టిన పెసలు , శనగలు లేక నానబెట్టి వాడేసిన పచ్చిశనగలు , పెసలు ఎక్కువుగా తీసుకోవాలి . రోజూ కనీసం ఒక్కసారైనా తీసుకోవటం మంచిది . పీచు ఎక్కువుగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మధుమేహం ఉపశమించటమే రక్తంలో కొవ్వు కూడా బాగా తగ్గుతుంది . గింజధాన్యాలు , కాయగూరలు , ఆకుకూరలు పీచు బాగా కలిగి ఉంటాయి. శనగలు , పెసలు పైతొక్కతో సహా తినటం వలన ఈ విషయంలో మరింత సత్ఫలితం కలుగుతుంది . కాయగూరలు పరిమితి లేకుండా కాయగూరలు .
కాకరకాయ, చిక్కుడు, ఆనప , బీర, వంకాయ, క్యాబేజీ , కాలిఫ్లవర్ , గుమ్మడి , బూడిదగుమ్మడి , సిమ్లా మిరప, తెల్లముల్లంగి, పోట్ల, మునగ , తొటకూర, గొంగూర, చుక్కకూర , కొత్తిమీర , మునగాకు కూర, పాలకూర మొదలగు అన్ని రకాల ఆకుకూరలు , నీరుల్లి, టొమాటో , దొండ , బెండ, అరటిపువ్వు , అరటిదూట .
కొవ్వు పదార్దాలు ఎక్కువుగా ఉన్న నెయ్యి , వెన్న , కొబ్బరి నూనె , పామాయిల్ వాడరాదు. కొవ్వు తక్కువ ఉన్న పొద్దుతిరుగుడు గింజల నూనె , నువ్వులనూనె మితంగా వాడవచ్చు . ఆహారం తక్కువ పరిమాణంలో రోజుకి ఎక్కువసార్లు తీసుకోవాలి . లావుగా ఉన్నవారు రోజువారి కేలరీలను కూడా తగ్గించాలి. దుంపకూరలు వాడరాదు.
ఎట్టి పరిస్థితులలో చక్కెర , తేనె , గ్లూకోజ్ , బెల్లం , స్వీట్స్ , జీడిపప్పు , బాదం , లేతకొబ్బరి , మత్తుపానీయాలు , శీతలపానీయాలు , హార్లిక్స్ , బూస్ట్ వంటి పోషక విలువలు కలిగిన పానీయాలు అరటి , మామిడి, పనస , సపోటా మొదలగు పండ్లు తీసుకోరాదు . ఉపవాసాలు , నిరాహారదీక్షలు చేయరాదు . రక్తంలో చక్కెర స్థాయి పూర్తిగా అదుపులో ఉంటే అవసరాన్ని బట్టి బత్తాయి, ఆపిల్ , పుచ్చకాయ, జామ , బొప్పాయి , ఉసిరి , కమలాఫలం తినవచ్చు .
అల్పాహారం - ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు.
టొమాటో జ్యూస్ ఒక కప్పు , మొలకెత్తుచున్న గింజలు , రొట్టె లేక చపాతి , పలుచని పాలు పంచదార లేకుండా లేక రాగిమాల్ట్ .
మధ్యాహ్న భోజనం -
12 నుండి 1 గంట వరకు.
రాత్రి భోజనం -
6 గంటల నుండి 9 గంటల వరకు .
కలగూర, దోసకాయ, టొమాటో , ముల్లంగి , కాకరకాయ, చిక్కుడు మొదలయిన కూరగాయలు , ఉప్పు , మిరియపు పొడి , నిమ్మకాయ చాలా మంచిది . కూరగాయలు ఉడకపెట్టిన నీరు , గోధుమ అన్నం , గోధుమ రొట్టె , ఆకుకూరలు ముఖ్యంగా ములగ , అవిశ , మెంతికూరలు .
సాయంత్రం అల్పాహారం -
3 గంటల నుండి 5 గంటల వరకు
బొప్పాయి ముక్కలు లేక జామపండు, సాల్ట్ బిస్కేట్స్ , పలచని పాలు లేక రాగిమాల్ట్ పంచదార కలపకుండా వాడవచ్చు .
మామిడి, అరటి, పిండిపదార్థాలు , ఎక్కువ ఒకేసారి కడుపు నిండగా తినవద్దు.

You Might Also Like

0 comments